నువ్వు పెద్ద తోపు, తురుం ఖాన్ వి కదా... హుజురాబాద్ చౌరస్తాలో చర్చకు సిద్దమా?: హరీష్ కు ఈటల సవాల్

By Arun Kumar PFirst Published Sep 2, 2021, 1:23 PM IST
Highlights

తనపై మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని... దమ్ముంటే ఆయన హుజురాబాద్ చౌరస్తాలో చర్చకు సిద్దమా? అని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.  

కరీంనగర్: రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ లో తిరుగుతూ మతిభ్రమించినవాడిలా కారుకూతలు కూస్తున్నాడని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ మండిపడ్డారు. డ్రామా కంపెనీ లాగా యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఆయన ప్రతి మాటా వ్యంగ్యంగానూ, ఇతరులను కించపరిచినట్టుగా ఉంటుందన్నాయని ఈటల అన్నారు. 

''ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. హరీష్ నీకు సవాలు చేస్తున్నా... హుజురాబాద్ లో అభివృద్ది జరగలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేదు, కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవు, నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్దమా? నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా... నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా నా సవాల్ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్దమా?'' అని ఈటల అన్నారు.  

''గత కొన్ని రోజులుగా మీరు చేస్తున్న నిర్వాకాన్ని హుజూరాబాద్ ప్రజానీకం అసహ్యించుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులాగా వెలకట్టి కొంటున్న నీచుడు హరీష్. ఈటల రాజేందర్ కు సంబందించన వాళ్ళ ఇండ్లకు వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. సీడ్ కంపెనీల ఉద్యోగులను కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వకపోతే ఉద్యోగం నుండి తిసేస్తామంటున్నారు. హుజూరాబాద్ ఆసుపత్రిలో నేను పెట్టించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిసేయమని ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలను మీ భర్తలు బిజెపిలో తిరిగితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలా మామా అల్లుళ్ళు తలకిందికి కాళ్లు పైకి చేసుకున్నా శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం" అని హెచ్చరించారు.

''ఈటల రాజేందర్ ది ఇంకా కారు గుర్తే అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఊళ్లకు ఊళ్లనే బార్లుగా మార్చిన నీచపు చరిత్ర నీది. తెలంగాణలో ఒకే కుటుంబానికి హక్కు ఉంటుంది అనేలాగా ప్రవర్తిస్తున్నారు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నపుడే హుజూరాబాద్ ను అభివృద్ది చేసాను'' అన్నారు. 

read more  జగన్‌తో కుమ్మక్కయ్యారా, లొంగిపోయారా?: కృష్ణా జలాలపై కేసీఆర్ పై రేవంత్ ఫైర్

''డబుల్ బెడ్రూం కమిటీ సలహా ఇవ్వకముందే జీఓ ఇచ్చి సబ్ కమిటీని సీఎం కేసీఆర్ అవమానించారు. నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి నియోజకవర్గంలో సర్వే చేపించి ముఖమంత్రిని అడిగాను. ఇలా 3900 ఇండ్లను మంజూరు చేయించుకుని ఇప్పటికే రెండు వేల ఇళ్లు పూర్తి చేసాను. కాళేశ్వరం కాంట్రాక్టర్లు సిద్దిపేట, సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టారు. మాకు అటువంటి కాంట్రాక్టర్లు లేరు'' అని పేర్కొన్నారు. 

''మీ పతనం మొదలయ్యింది. మీ మామ మాయలో పడి నీ సహచరుడు మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే త్వరలో నీకు ప్రజలు జవాబు చెపుతారు. మొత్తం నియోజకవర్గంలో మహిళ సంఘాలు, కుల సంఘాల భవనాలను నా హయాంలోనే మంజూరు చేసినా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే కట్టలేదు. తెలంగాణ ప్రభుత్వ పనులు చేయడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే నయమని కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు'' అన్నారు. 

''నేను గళమెత్తితే నీకు మంత్రి పదవి వచ్చింది. అలాంటిది నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశిస్తే పని చేసే రబ్బరు స్టాంపులా మారావు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పగలవా? దళిత బందు ఇవ్వడానికి సంత్సరానికి పది వేల కోట్లు కేటయిందే సత్తా ఉందా? ప్రతిఏడాదీ పది వేల కోట్లు కేటాయించినా దళితులందరికీ డబ్బులు అందాలంటూ ఇరవై సంవత్సరాలు కావాలి. ఒక్క నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు ఖర్చుపెట్టే డబ్బు ఎక్కడినుండి వచ్చింది?'' అని మంత్రి హరీష్ ను ఈటల నిలదీశారు. 
 

click me!