షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీ కొట్టుకున్నవాహనాలు.. పలువురికి గాయాలు..

Published : Apr 09, 2021, 01:16 PM IST
షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీ కొట్టుకున్నవాహనాలు.. పలువురికి గాయాలు..

సారాంశం

కొత్త పార్టీ ఆవిష్కరణ సభకోసం ఖమ్మం వెడుతోన్న వైయస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మంలో సాయంత్రం 5గంటలకు వైయస్ షర్మిల సంకల్ప సభ జరగనునన నేపథ్యంలో ఈ ఉదయం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్ తో బయల్దేరారు షర్మిల.

అయితే మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మద్యాహ్నం ఒంటిగంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. ఇవాళ జరిగే సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. 

ఖమ్మం బయలుదేరిన షర్మిల: అందరి చూపు పెవిలియన్ గ్రౌండ్స్ వైపే...

అటు ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైయస్ అభిమానులు తరలివస్తున్నారు. సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 

ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటలకు  భారీ కాన్వయ్ తో షర్మిల లోటస్ పాండ్ నుండి ఖమ్మం బయలుదేరారు. లక్టీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ , హయత్ నగర్ కు ఉదయం 9:30 గంటలకు చేరుకొన్నారు. హయత్ నగర్ లో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ఉదయం పదిన్నర గంటలకు  చౌటుప్పల్, మధ్యాహ్నం 12 గంటలకు నకిరేకల్, 12 గంటల 45 నిమిషాలకు సూర్యాపేటలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.  చివ్వెంలో ఆమె మధ్యాహ్న భోజనం కోసం ఆగుతారు.మోతె మండలం నామవరంలో రెండున్నర గంటలకు చేరుకొంటారు. మూడు గంటలకు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం చేరుకొంటారు. సాయంత్రం 5:15 గంటలకు పెవిలియన్ గ్రౌండ్స్ కు షర్మిల చేరుకొంటారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?