
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండో రోజు తన దీక్షను కొనసాగిస్తున్నారు. గురువారం నాడు ఇందిరాపార్క్ వద్ద షర్మిల తొలి రోజున దీక్షను చేపట్టారు. దీక్షకు పోలీసులు ఒక్క రోజే అనుమతి ఇవ్వడంతో దీక్షను గురువారం సాయంత్రం ఆమె ముగించారు. శుక్రవారం నాడు ఉదయం నుండి ఆమె రెండో దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం షర్మిలకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు.షర్మిలను దీక్షా శిబిరంలో వైఎస్ విజయమ్మ పరామర్శించారు.
also read:దీక్ష భగ్నం.. రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన షర్మిల, లోటస్‌పాండ్‌లో నిరసన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ తో 72 గంటల పాటు దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇదే డిమాండ్ తో దీక్షలు చేస్తారని ఆమె ప్రకటించారు. ఏ పార్టీ కానీ, నాయకుడు కానీ పట్టించుకోకున్నా తాము ఈ వషయాన్ని వదిలిపెట్టమని ఆమె ప్రకటించారు.