దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు ఆందోళనను అధికం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. అనేక జిల్లాల్లో వందలాది కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు ఆందోళనను అధికం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. అనేక జిల్లాల్లో వందలాది కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
వారం రోజులుగా సగటున రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్ లకు కరోనా పాజిటివ్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. అయితే ఇందులో నలుగురు డాక్టర్లు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న హౌస్ సర్జన్లు అని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1797కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.52శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 87.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 90.55శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 75, నాగర్ కర్నూల్ 60, జోగులాంబ గద్వాల 26, కామారెడ్డి 144, ఆదిలాబాద్ 85, భూపాలపల్లి 16, జనగామ 48, జగిత్యాల 167, అసిఫాబాద్ 23, మహబూబ్ నగర్ 124, మహబూబాబాద్ 24, మెదక్ 64, నిర్మల్ 159, నిజామాబాద్ 303, సిరిసిల్ల 88, వికారాబాద్ 69, వరంగల్ రూరల్ 45, ములుగు 14, పెద్దపల్లి 66, సిద్దిపేట 86, సూర్యాపేట 57, భువనగిరి 70, మంచిర్యాల 101, నల్గొండ 116 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 505కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 407, రంగారెడ్డి 302, కొత్తగూడెం 54, కరీంనగర్ 124, ఖమ్మం 111, సంగారెడ్డి 175, వరంగల్ అర్బన్ 114కేసులు నమోదయ్యాయి.