YS Sharmila సంచలన నిర్ణయం.. వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 10:27 AM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన నిర్ణయం తీసుకన్నారు. పార్టీలో ఇప్పటివరకు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన నిర్ణయం తీసుకన్నారు. పార్టీలో ఇప్పటివరకు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జూలై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించిన వైఎస్ షర్మిల.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే ఆమె తెలంగాణలో వైఎస్ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇక, పార్టీ ఏర్పాటు తర్వాత నిరుద్యోగ దీక్ష, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అంతకాకుండా తెలంగాణలో పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే తొలుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల పాదయాత్ర వాయిదా పడింది. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయినప్పటికీ షర్మిల సోషల్ మీడియా వేదికగా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే గతడేది పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. తరువాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్‌ మీడియాతోపాటు పలు రకాల విభాగాలను ఏర్పాటు చేసి ఇన్‌ఛార్జులను నియమించారు. అయితే తాజాగా వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టుగా షర్మిల ప్రకటించారు. వాటి స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. అయితే షర్మిల ఒక్కసారిగా అన్ని కమిటీలను రద్దు చేయడం ఆమె పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

కమిటీల రద్దు తర్వాత కొత్తగా నియమించిన కోఆర్డినేటర్ల విషయానికి వస్తే.. ఆదిలాబాద్‌- బెజ్జంకి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌- నీలం రమేష్‌, ఉమ్మడి ఖమ్మం- గడిపల్లి కవిత, హైదరాబాద్‌- వడుక రాజగోపాల్‌,  వరంగల్‌, హనుమకొండ- నాడెం శాంతికుమార్‌, వికారాబాద్‌- తమ్మాలి బాలరాజ్‌, నల్గొండ- ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి- మహమ్మద్‌ అత్తార్‌ఖాన్‌, ములుగు- రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి- అప్పం కిషన్‌, రంగారెడ్డి- ఎడమ మోహన్‌రెడ్డి, నారాయణపేట- మడివాల కృష్ణ లను నియమించారు. 
 

click me!