14యేళ్ల అమ్మాయిని 61యేళ్ల వ్యక్తికి అమ్మబోయారు... అమ్మ, అమ్మమ్మ ఘాతుకం..

Published : Jan 25, 2022, 07:11 AM IST
14యేళ్ల అమ్మాయిని 61యేళ్ల వ్యక్తికి అమ్మబోయారు... అమ్మ, అమ్మమ్మ ఘాతుకం..

సారాంశం

కొద్ది రోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను తిరిగి ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారం అందించారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి మూడు లక్షల రూపాయలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకున్నారు.    

హైదరాబాద్ : పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది. భార్యకు divorce ఇచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ళ వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమయ్యింది. అమ్మ, అమ్మమ్మ కలిసి... మరో ఐదుగురు మహిళలు Intermediariesగా నిలిచి చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి attacks చేసి తొమ్మిది మందిని arrest చేశారు. హైదరాబాదులోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఇన్స్పెక్టర్ ఆర్.బి భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ (61).. ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరం అని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్ లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్ అహ్మద్ (37) సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్ నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), shabana బేగం (38), షమీం సుల్తానా(45), నస్రీన్ బేగం ( 40 ), జాహెద్ బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు.

ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్ కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14)ను అల్తాఫ్ అలీకి రూ. 5లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో  ఒప్పందం  రద్దు అయ్యింది.  

అయితే  కొద్ది రోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను తిరిగి ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారం అందించారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి మూడు లక్షల రూపాయలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకున్నారు.  

డబ్బు చెల్లించి బాలికను తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి దీనిపై సమాచారం అందడంతో బాలాపూర్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలోని పోలిసు బృందం ఆదివారం రాత్రి  దామని ఎర్రగుంటలో దాడులు చేసింది.  తొమ్మిది మందిని అరెస్టు చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 

ఇదిలా ఉండగా జనవరి 22న జయశంకర్ భూపాలపల్లిలో ఇలాంటి దారుణమే జరిగింది. యువతులు, మహిళల నుంచి వృద్ధుల వరకు అందరినీ తమ కామదాహానికి బలి చేస్తున్న దుర్మార్గులు.. అభం శుభం తెలియని చిన్నారులతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో దారుణం జరిగింది.

గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న ఆరేళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే చిన్నారి సోదరుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తుండగా.. కిషోర్ చేసిందంతా చెప్పారు. దీనిపై కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు  కిషోర్ కు దేహశుద్ది చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే నిందితుడికి మరోసారి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. కిశోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu