షర్మిలది ఆంధ్రా.. ఖమ్మంలోనే ఎందుకు? రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Published : Jul 09, 2023, 05:56 PM IST
షర్మిలది ఆంధ్రా.. ఖమ్మంలోనే ఎందుకు? రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ షర్మిలది ఆంధ్రా అని రేణుకా చౌదరి అన్నారు. ఆమె అన్న అక్కడే ఉన్నారనీ పేర్కొన్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారని, కానీ, రాష్ట్రమంతా వదిలి ఖమ్మంలోనే ఎందుకు తిష్ట వేశారని అన్నారు.  

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఖమ్మం సభ తర్వాత హస్తం శ్రేణుల్లో జోష్ వచ్చింది. అప్పటి నుంచే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరబోతున్నారనే వార్తలు వస్తున్న సందర్భంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలది ఆంధ్రా అంటూ తన వైఖరి స్పష్టం చేశారు. రాష్ట్రమంతా వదిలి వారంతా ఖమ్మంలోనే ఎందుకు ఉంటున్నారంటూ ఈ ఖమ్మం పొలిటీషియన్ కామెంట్ చేశారు.

షర్మిల ఎవరో కూడా తనకు తెలియదని రేణుకా చౌదరి పేర్కొన్నారు. అనంతరం, షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ అని, ఆమె అన్న అక్కడే ఉన్నారని రేణుకా చౌదరి ఆమె పట్ల తన వైఖరిని స్పష్టం చేశారు. ఆమె తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టారని, అయనా.. వారంతా రాష్ట్రం మొత్తాన్ని వదిలి ఖమ్మంలోనే ఎందుకు తిష్ట వేసినట్టు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే విలేకరులు వేసిన ప్రశ్నగా తనదైన మార్క్ డైలాగ్ డెలివరీ చేశారు. ఖమ్మం నుంచి ఆమెను పంపేసే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? అని అడగ్గా.. తనను ఖమ్మం నుంచి బయటికి పంపే మొనగాడు పుట్టలేదంటూ సమాధానం ఇచ్చారు. 

Also Read: ములుగు ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ తీస్తా: బండ్ల గణేష్ సంచలనం

లోక్ సభ ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశాలు ఉన్నాయని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణతోపాటే ఈ ఎన్నికలు జరిగినా జరగొచ్చు అంటు చెప్పారు. ఇటు తెలంగాణలో, అటు కేంద్రంలోనూ అధికారం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందని వివరించారు. తమ పార్టీలో చేరడానికి చాలా మంది రెడీగా  ఉన్నారని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?