వీడియోలు చేస్తూ.. అమ్మాయిలను ముగ్గులోకి, నాలుగో పెళ్లికి సిద్ధం: యూట్యూబర్ ఆటకట్టించిన వివాహిత

Siva Kodati |  
Published : Feb 17, 2023, 02:16 PM IST
వీడియోలు చేస్తూ.. అమ్మాయిలను ముగ్గులోకి, నాలుగో పెళ్లికి సిద్ధం: యూట్యూబర్ ఆటకట్టించిన వివాహిత

సారాంశం

అమ్మాయిలను ట్రాప్ చేస్తూ నాలుగో పెళ్లికి సిద్ధమైన యూట్యూబర్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాక్ అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చేస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడు. వివాహితను ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇషాక్ వ్యవహారం తెలుసుకున్న సదరు వివాహిత అతన్ని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వివాహిత దగ్గరి నుంచి ఇషాక్ డబ్బులు తీసుకుని పరారయ్యాడు. దీంతో అతనిపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే