పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సుప్రీం పచ్చజెండా: ఎన్జీటీ జరిమానాపై స్టే

By narsimha lode  |  First Published Feb 17, 2023, 1:39 PM IST

పాలమూరు -రంగారెడ్డి  ప్రాజెక్టుకు  సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.  తాగు నీటి అవసరాలకు  ఈ ప్రాజెక్టును  వినియోగించాలని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. 
 


హైదరాబాద్: పాలమూరు- రంగారెడ్డి  ప్రాజెక్టు‌కు  సుప్రీంకోర్టు పచ్చజెండా  ఊపింది.  ఈ ప్రాజెక్టుపై  ఎన్జీటీ విధించిన   రూ. 920 కోట్ల జరిమానాపై  సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్టే విధించింది. పర్యావరణ అనుమతులున్న మేరకు పనులు  చేసుకొనేందుకు  సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. 7.15 టీఎంసీల  వరకు  పని కొనసాగించేందుకు  సుప్రీంకోర్టు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.   తాగు నీటి అవసరాలకే  ప్రాజెక్టును వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు  తేల్చి చెప్పింది.  పర్యావరణ  అనుమతులు, లేకుండా  పాలమూరు-రంగారెడ్డి  , డిండి లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టులకు  నిర్మించినందుకు  గాను  తెలంగాణ ప్రభుత్వానికి  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  చెన్నై బెంచ్ రూ. 920 కోట్లు  జరిమానా విధిస్తూ  2022 డిసెంబర్  22న  తీర్పును వెల్లడించింది. 

పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుకు  పర్యావరణ  పరిహరం కింద  రూ. 528 కోట్లు డిండి  ప్రాజెక్టుకు  రూ. 92. 85 కోట్లున్నాయని ధర్మాసనం  ఆదేశించింది ఎన్జీటీ ఆదేశాలపై  తెలంగాణ ప్రభుత్వం  సుప్రీంకోర్టును    2022 డిసెంబర్  24వ తేదీన ఆశ్రయించింది. 

Latest Videos

పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుపై  ఎన్జీటీ విధించిన  జరిమానాపై   తెలంగాణ ఇరిగేషన్  ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి  రజత్ కుమార్  అధికారులతో  సమీక్ష నిర్వహించారు.   న్యాయ  నిపుణుల  సలహ తీసుకున్నారు.  ఎన్జీటీ  ఇచ్చిన స్టేపై  సుప్రీంకోర్టులో  అప్పీల్  చేయాలని  నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం మేరకు  సుప్రీంకోర్టులో  ఎన్జీటీ  విధించిన  జరిమానాపై  స్టే  కోరింది  తెలంగాణ ప్రభుత్వం.  ఈ విషయమై  విచారణ నిర్వహించిన  సుప్రీంకోర్టు  ఎన్జీటీ విధించిన  జరిమానాపై  స్టే  ఇచ్చింది.  

  
 

 

click me!