Naa Anveshana : రూ.300 కోట్ల బెట్టింగ్ స్కాం కేసు .. అడ్డంగా బుక్కైన తెలుగు యూట్యూబర్

Published : May 04, 2025, 10:28 AM ISTUpdated : May 04, 2025, 10:50 AM IST
Naa Anveshana :  రూ.300 కోట్ల బెట్టింగ్ స్కాం కేసు .. అడ్డంగా బుక్కైన తెలుగు యూట్యూబర్

సారాంశం

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ను ఇరకాటంలో పెట్టిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అతడు ఏకంగా తెలంగాణ సీఎస్, డిజిపిలతో పాటు ఇతర టాప్ అఫిషియల్స్ పై ఆరోపణలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. 

Na Anveshana : ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్వేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. 'నా అన్వేషణ' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాదిమంది సబ్స్క్రైబర్లకు దగ్గరయ్యాడు... అతడి ట్రావెలింగ్ వీడియోలకు మిలియన్స్ లో వీవ్స్ వస్తుంటాయి. అయితే తన వీడియోలదతో కంటే తోటి యూట్యూబర్లతో వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇలా తాజాగా తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్వేష్ చిక్కుల్లో పడ్డాడు.  అతడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. 

ఇటీవల బెట్టింగ్ యాప్ లపై వరుస వీడియోలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాడు అన్వేష్. అతడు తెలంగాణ ఐపిఎస్ ఆఫీసర్, ప్రస్తుత ఆర్టిసి ఎండీ సజ్జనార్ తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో బయటపెట్టేందుకు ఓ వీడియో చేసాడు. ఇది బాగా హిట్ కావడంతో పోలీసులు కూడా కదిలారు... బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తో కొందరు సినీనటులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరిని ఇప్పటికే విచారించారు పోలీసులు. 

అయితే పోలీసులు రంగంలోకి దిగాక కూడా యూట్యూబర్ అన్వేష్  ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు... విచారణలో ఉండగా దీనిగురించి వరుస వీడియో చేయసాగాడు. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసాడు. ఇందులో తెలంగాణ డిజిపితో పాటు చీప్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ  అన్వేష్ ఆరోపణలు చేసాడు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేసారు. 

 

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనక ఉన్నతాధికారులు ఉన్నారన్నది అన్వేష్ ఆరోపణ. ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి లతో పాటు మరికొందరు ఐఏఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నతాధికారులపై అన్వేష్ అవినీతి ఆరోపణలు చేసాడు. వీరంతా కలిసి బెట్టింగ్ యాప్స్ నిర్వహకులతో కుమ్మక్కయి రూ.300 కోట్లు కొట్టేసారంటూ సంచలన ఆరోపణలు చేసాడు.

యూట్యూబ్ వీడియోల ద్వారా అన్వేష్ ఉన్నతాధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రభుత్వం, చట్టబద్ద సంస్థలపై అన్వేష్ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఉన్నాయని, ద్వేషాన్ని కలగించేలా ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసారు. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.  అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా