వీడి దుంపతెగ.. ఆరెంజ్ జ్యూస్ ను పెట్రోల్ అని ఒంటిమీద పోసుకుని కలెక్టరేట్ లో హల్ చల్..చివరికి..

By SumaBala BukkaFirst Published Feb 7, 2023, 10:31 AM IST
Highlights

ఓ యువకుడు కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజావాణిలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని కలకలం రేపాడు. అయితే ఇంతకీ అతను పోసుకుంది ఆరెంజ్ జ్యూస్ అని తేలడంతో అంతా అవాక్కయ్యారు.  

హనుమకొండ : సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఈ ఘటన హనుమకొండ కలెక్టరేట్లో కలకలం రేపింది.  అయితే, ఆ యువకుడు ఒంటిపై పోసుకుంది పెట్రోలు కాదని ఆరెంజ్ జ్యూస్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం జరిగింది. దీనికి హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు హాజరయ్యారు. 

ఈ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అజయ్ రెడ్డి కూడా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు.అజయ్ రెడ్డికి భూ సమస్య ఉంది. గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కావడం లేదు. ఈ విషయాన్ని అజయ్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో చెబుతూ.. తన సమస్య పరిష్కారం కావడం లేదు కాబట్టి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ.. తనతో పాటు సీసాలో తెచ్చుకున్న ఆరెంజ్ కలర్ ద్రావణాన్ని ఒంటిమీద పోసుకున్నాడు. అది గమనించి వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకున్నారు.  

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి..

అయితే దగ్గర నుంచి పెట్రోల్ వాసన రాలేదు. దీంతో అనుమానం వచ్చినా సెక్యూరిటీ సిబ్బంది సీసాలోని ద్రావణాన్ని పరిశీలించగా అది ఆరెంజ్ జ్యూస్ అని గుర్తించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఏవో కిరణ్ ప్రకాష్ ఆ యువకుడుతో మాట్లాడారు. కాస్తులో తన భూమి ఉందని దానికి పట్టాలేదని స్థానిక అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కాలేదని ఆ యువకుడు వాపోయాడు. దీంతో ఈ యువకుడి భూ సమస్యకు కలెక్టర్ పరిష్కార మార్గం తెలియజేశారు. 

click me!