మాయమాటలతో మైనర్ బాలికను లోబరుచుకొని..

Published : Jun 29, 2020, 12:57 PM ISTUpdated : Jun 29, 2020, 12:59 PM IST
మాయమాటలతో మైనర్ బాలికను లోబరుచుకొని..

సారాంశం

ఈ నెల 25న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని పెద్దకొత్తపల్లి వైపు తీసుకెళ్తుండగా గుర్తించిన గ్రామస్తులు తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు.

మాయ మాటలు చెప్పి... మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. దాదాపు ఆరు నెలలపాటు.. ఆ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బావాయిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక తరచూ పిండి పట్టించుకునేందుకు గిర్నీకి వచ్చేది. మాయమాటలు చెప్పి లోబర్చుకొని అత్యాచారం చేస్తున్నాడు. ఈ నెల 25న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని పెద్దకొత్తపల్లి వైపు తీసుకెళ్తుండగా గుర్తించిన గ్రామస్తులు తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు.

దీంతో వారు కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆదివారం వినోద్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?