
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ కలకలం రేపింది. మొఘల్‌పురాలో అంధేరిగల్లీలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
నవాజ్ అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.