మత్తు పదార్థాల కోసం పాన్ షాప్ లో యువకుల వీరంగం...

Published : Jul 30, 2021, 02:31 PM IST
మత్తు పదార్థాల కోసం పాన్ షాప్ లో యువకుల వీరంగం...

సారాంశం

ఎమ్మెస్ పాన్ దర్బార్ షాపు వద్దకు ముగ్గురు యువకులు వచ్చారు. ఓబీసీ ప్రీమియమ్ పేపర్ అనే మత్తు పదార్థం కావాలంటూ హల్ చల్ చేశారు. అలాంటివి ఇక్కడ దొరకవని షాపు యజమాని సమాధానమిచ్చాడు. అయితే షాపు ఎందుకు తెరిచావంటూ గొడవకు దిగారు. 

హైదరాబాద్ : మత్తు పదార్థాలు కావాలంటూ పాన్ షాప్ లో యువకులు హల్ చల్ చేశారు. మత్తు పదార్థాలు లేవన్నందుకు షాపు యజమానిమీద గొడవకు దిగారు. ఈ సంఘటన రాజకొండ కమిషనరేట్ పరిధి బోడుప్పల్ లో జరిగింది. 

ఎమ్మెస్ పాన్ దర్బార్ షాపు వద్దకు ముగ్గురు యువకులు వచ్చారు. ఓబీసీ ప్రీమియమ్ పేపర్ అనే మత్తు పదార్థం కావాలంటూ హల్ చల్ చేశారు. అలాంటివి ఇక్కడ దొరకవని షాపు యజమాని సమాధానమిచ్చాడు. అయితే షాపు ఎందుకు తెరిచావంటూ గొడవకు దిగారు. 

షాపు ఫ్లెక్సీని చించేసి, దాడికి ప్రయత్నించారు. దీంతో షాపు యజమాని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకులు హల్ చల్ చేసిన దృశ్యాలు సీసీ టీవీ కెమరాలో రికార్డ్ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్