నాగర్ కర్నూల్ లో విషాదం... బైక్ యాక్సిడెంట్ లో తండ్రీకొడుకుల మృతి

Arun Kumar P   | Asianet News
Published : Jul 30, 2021, 01:48 PM IST
నాగర్ కర్నూల్ లో విషాదం... బైక్ యాక్సిడెంట్ లో తండ్రీకొడుకుల మృతి

సారాంశం

రెండు బైక్స్ అతి వేగంతో ఎదురెదురుగాా వచ్చి ఢీకొనడంతో తండ్రీ కొడుకులు చనిపోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నాగర్ కర్నూలు: రెండు బైక్ లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో తండ్రీ కొడుకులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు.  

వివరాల్లోకి వెళితే... బిజినపల్లికి చెందిన బాలయ్య గౌడ్ (65), శివ కుమార్ (35) తండ్రీకొడుకులు. వీరిద్దరు బైక్ పై వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడిన తండ్రికొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

read more వారిద్దరి మధ్య గొడవలు: హైద్రాబాద్‌లో ప్రేమ జంట మృతిలో సంచలన విషయాలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిని ఇద్దరిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ