సిరిసిల్లలో వర్కర్ టూ ఓనర్ స్కీమ్: కేటీఆర్

By narsimha lode  |  First Published Jul 30, 2021, 1:31 PM IST

సిరిసిల్లలో చేనేత కార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రానున్న రోజుల్లో సిరిసిల్లలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపట్టనుందన్నారు.



సిరిసిల్ల: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం నాడు  సిరిసిల్లలో ని పెద్దూర్ అప‌రెల్ పార్కులో గోక‌ల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు..సిరిసిల్లలో  అపెరల్ పార్క్ స్థానికుల కల అని ఈ కలను సీఎం కేసీఆర్ నిజం చేశారని ఆయన గుర్తు చేశారు.ఈ పార్క్ వల్ల పదివేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.10 వేల ఉద్యోగుల్లో 80 శాతానికి పైగా మహిళలే ఉంటారని చెప్పారు.

సిరిసిల్లలో భర్త మగ్గం నేస్తే భార్య బీడీలు చుట్టి ఉపాధి పొందే పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు.సిరిసిల్ల ఒకనాడు ఉరిసిల్లగా ఉండేదన్నారు. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు.సిరిసిల్ల అపెరల్ పార్క్ లో ఫ్యాక్టరీలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

ఈ ప్రాంతంలో వారంలో 8 మంది చేనేత కార్మికులు  ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇక్కడ ఉత్పత్తయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్తాయన్నారు. సిరిసిల్లలో వర్కర్ టూ ఓనర్ అనే కార్యక్రమాన్ని కూడ శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం కింద రూ. 450 కోట్లను ఖర్చు పెడుతున్నామన్నారు.పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన 10 వేల మంది చేనేత కార్మికుల ఉపాధి కల్పిస్తామన్నారు. 


 

click me!