ఫార్ములా ఈ రేస్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం.. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళన..

Published : Feb 11, 2023, 04:13 PM IST
ఫార్ములా ఈ రేస్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం.. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళన..

సారాంశం

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్ రేసింగ్‌లతో ఉపయోగం లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్ రేసింగ్‌లతో ఉపయోగం లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఖైరతాబాద్ జంక్షన్ దగ్గరికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలు.. ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్న నెక్లెస్ రోడ్డు వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో కాసేపు ఖైరతాబాద్‌ జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఇక, భారత్ లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న  ఎఫ్ఐఎ ఫార్మాలా ఈ ఛాంపియన్‌షిప్  ఈరోజు హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్  చుట్టూ  నిర్మించిన ప్రత్యేక ట్రాక్ (స్ట్రీట్ సర్క్యూట్)  చుట్టూ జరుగుతుంది.  ట్రాక్ పై అవగాహన కల్పించేందుకు గాను  శుక్రవారం  ప్రీ ప్రాక్టీస్ - 1 ను నిర్వహించగా   శనివారం ఉదయం   8 గంటల నుంచి 9 గంటల వరకూ  ప్రీ ప్రాక్టీస్ - 2 ను నిర్వహించారు. తర్వాత క్వాలిఫయింగ్ రౌండ్ కు తెర లేవనుంది.  ఈ రేస్‌ను సచిన్ టెండూల్కర్, రామ్ చరణ్ తేజ్‌, దుల్కర్ సల్మాన్, శిఖర్ దావన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సహా పలువురు ప్రముఖులు వీక్షిస్తున్నారు. 

ట్యాంక్‌బండ్ చుట్టూ  నిర్మించిన  2.83 కిలోమీటర్ల ట్రాక్ పై  రేసర్లు దూసుకుపోనున్నారు. రేసర్ల విన్యాసాలను వీక్షించడానికి గాను  ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. టికెట్ ధరలను  వెయ్యి, నాలుగు వేలు,  ఏడు వేలు,  పది వేల ఐదు వందలుగా నిర్ణయించారు.  

ఏంటీ ఫార్ములా ఈ రేసు..? 
సాధారణ రేసింగ్ కార్ల మాదిరిగా కాక ఎలక్ట్రిక్  కార్లతో  ఈ రేసింగ్ జరుగబోతున్నది.   కర్భన ఉద్గారాలను తగ్గించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.  పర్యావరణ  హితం కోరుతూ   ఆయా దేశాలు ‘గో గ్రీన్’ పేరిట ఎఫ్1 రేసుల స్థానంలో ‘ఫార్ములా ఈ రేసు’లను ప్రోత్సహిస్తున్నాయి.  పెట్రోల్, డీజిల్ కార్ల వాడకాన్ని తగ్గించడం కూడా   దీని ప్రధాన ఉద్దేశం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!