ప్రేమను అంగీకరించని పెద్దలు.. ప్రేయసితో మాట్లాడుతూనే..

Published : Apr 02, 2021, 08:22 AM ISTUpdated : Apr 02, 2021, 08:29 AM IST
ప్రేమను అంగీకరించని పెద్దలు.. ప్రేయసితో మాట్లాడుతూనే..

సారాంశం

వారి పెళ్లికి ఇరుకుటుంబాల వారు నిరాకరించారు. ఈ క్రమంలో.. బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన మనోజ్..  పై అంతస్తులో ఉండే గదిలోకి వెళ్లాడు.

అతను ఓ యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే.. వారి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో.. మనస్థాపం చెందిన యువకుడు ప్రేమయసితో వీడియో కాల్ మాట్లాడుతూనే గొంతు కోసుకున్నాడు. ఈ సంఘటన సిద్ధిపేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట హౌసింగ్ బోర్డు పరిధిలోని అరుంధతి కాలనీకి చెందిన బి. మనోజ్ కుమార్(25) ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయం ఇరు కుటుంబీకులకు తెలియడంతో.. వారు పంచాయతీ పెట్టారు.

వారి పెళ్లికి ఇరుకుటుంబాల వారు నిరాకరించారు. ఈ క్రమంలో.. బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన మనోజ్..  పై అంతస్తులో ఉండే గదిలోకి వెళ్లాడు. అక్కడే ల్యాబ్ పరీక్షలు నిర్వహించే అతను.. అర్థరాత్రి దాటక ప్రేయసికి వీడియో కాల్ చేశాడు.

ఆమెతో మాట్లాడుతూనే.. గొంతు,చెయ్యి కోసుకున్నాడు. వెంటనే యువతి.. మనోజ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వాళ్లు హుటాహుటినా అక్కడకు చేరుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి
IMD Cold Wave Alert : తెలంగాణ 33 జిల్లాలో ఈ నాల్రోజులూ చలే.. ఈ ఆరుజిల్లాల్లో అల్లకల్లోలమే..!