చిన్నపిల్లలను కట్టేసి.. బలవంతంగా పేడ తినిపించి...

Published : Apr 02, 2021, 07:54 AM IST
చిన్నపిల్లలను  కట్టేసి.. బలవంతంగా పేడ తినిపించి...

సారాంశం

వాళ్లు మామిడి కాయలు దొంగతనం చేయడానికి వచ్చారంటూ వారిని కాపలాదారులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పశువుల మాదిరిగా తాళ్లతో కట్టేసి చితకబాదారు. అనంతరం బలవంతంగా పేడ తినిపించారు.  

అభం శుభం తెలియని చిన్నపిల్లల పై ఇద్దరు వ్యక్తులు అత్యంత కర్కశత్వంగా ప్రవర్తించారు. మామిడి తోటకు తమ పెంపుడు కుక్క కోసం వెతుక్కుంటూ రాగా.. దొంగతనానికి వచ్చారంటూ.. కట్టేసి.. బలవంతంగా పేడ తినిపించారు. ఈ దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తొర్రూర్ కి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు... తాము పెంచుకునే కుక్క కనిపించడం లేదంటూ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలోకి వెళ్లారు. అయితే.. వాళ్లు మామిడి కాయలు దొంగతనం చేయడానికి వచ్చారంటూ వారిని కాపలాదారులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పశువుల మాదిరిగా తాళ్లతో కట్టేసి చితకబాదారు. అనంతరం బలవంతంగా పేడ తినిపించారు.


కాగా.. దీనిని కొందరు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు తొర్రూర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు.. కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలను హింసించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu