వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి...

Published : Jul 22, 2020, 12:21 PM IST
వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి...

సారాంశం

ఎవరూ చూడకుండా.. ఓ రోజు సదరు వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.  

ఓ వివాహిత పై యువకుడు కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి.. సదరు వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాలలోని సూరారం గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఎవరూ చూడకుండా.. ఓ రోజు సదరు వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ అతడి వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు