పార్శిల్, కార్గో సర్వీసుల సక్సెస్: అమెజాన్‌తో చర్చలకు తెలంగాణ ఆర్టీసీ సిద్దం

By narsimha lode  |  First Published Jul 22, 2020, 11:46 AM IST

కరోనాతో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమెజాన్ సంస్థతో ఆర్టీసీ చర్చలు జరుపుతోంది.ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందానికి ఆ సంస్థ ప్రయత్నాలను ప్రారంభించింది. 



హైదరాబాద్: కరోనాతో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమెజాన్ సంస్థతో ఆర్టీసీ చర్చలు జరుపుతోంది.ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందానికి ఆ సంస్థ ప్రయత్నాలను ప్రారంభించింది. 

బస్సుల్లో ప్రయాణం చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎక్కువగా స్వంత వాహనాలు ఉపయోగిస్తున్నారు.

Latest Videos

undefined

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభయ్యాయి. హైద్రాబాద్ లో మాత్రం సిటీ బస్సులు మాత్రం ప్రారంభించలేదు. 

కరోనాకు ముందు ప్రతి రోజూ ఆర్టీసీకి రూ. 5 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా రోజూ కనీసం రూ. 2 కోట్లు మాత్రమే ఆదాయం రావడం కూడ కష్టంగా మారింది. ఈ రూ. 2 కోట్లు  ఆర్టీసీ డీజీల్ కు సరిపోవడం లేదు.

also read:కరోనా దెబ్బ: 4నెలల్లో ఏపీఎస్ఆర్టీసీకి రూ. 5 వేల కోట్ల నష్టం

దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్గో, కొరియర్, పార్శిల్ సేవలను ఇటీవల ప్రారంభించింది. గతంలో పార్శిల్ సేవలను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చింది ఆర్టీసీ. కానీ ప్రస్తుతం ఈ సేవలనను ఆర్టీసీ చేపట్టింది. ప్రైవేట్ సంస్థలు ఈ సేవలు నిర్వహించే సమయంలో ప్రతి రోజూ ఆర్టీసీకి ఒక్క లక్ష రూపాయాలు మాత్రమే వచ్చేది. కానీ, ప్రస్తుతం రోజూ రూ. 5 లక్షలకు చేరుకొంది.

also read:గుడ్‌న్యూస్: తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్న కార్గో, కొరియర్ సేవలు

పార్శిల్, కార్గో, కొరియర్ సేవలకు వస్తోన్న రెస్పాన్స్ తో ఈ సేవలను మరింత విస్తరించాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కార్గో సేవల కోసం 126 పెద్ద బస్సులు ఉన్నాయి. త్వరలోనే మరో 24 పెద్ద బస్సులు రానున్నాయి. ఈ బస్సుల్లో ఒకేసారి 9 టన్నుల సరుకులను సరఫరా చేసే వీలుంది.

దీంతో అమెజాన్ సంస్థకు ఆర్టీసీ ఇప్పటికే లేఖలు రాసింది. ఆ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు తమకు అవకాశం కల్పించాలని  కోరింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ ప్రతినిధులతో ఆర్టీసీ అధికారులు చర్చించాలని భావిస్తున్నారు. అమెజాన్ తో పాటు ఇతర ఈ కామర్స్ సంస్థలతో కూడ చర్చించాలని ఆ సంస్థ భావిస్తోంది. 

also read:కరోనా దెబ్బ: తెలంగాణ ఆర్టీసీకి 4 నెలల్లో రూ. 1000 కోట్ల నష్టం

ఆర్టీసీ కార్గో సేవలను మూడు మాసాల క్రితం ప్రారంభించింది. సుమారు నెల రోజుల క్రితం పార్శిల్ సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ చేపట్టింది. మందులను రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ సరఫరా చేస్తోంది. విద్యాశాఖకు చెందిన పుస్తకాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసే కాంట్రాక్టును ఆర్టీసీ దక్కించుకొంది. 

ప్రభుత్వ రంగ సంస్థలను కూడ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ లేఖలు రాసింది. ఎఫ్‌సీఐ, రామగుండం ఫెర్టిలైజర్స్, సింగరేణి తదితర సంస్థలకు ఆర్టీసీ  తమ సేవలు వినియోగించుకోవాలని లేఖలు రాసింది.

click me!