
హైదరాబాద్ (hyderabad) పాతబస్తీ (old city) కుల్సుంపురాలో (kulsumpura) ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. స్థానిక కరెంట్ ఆఫీస్‌పై (electricity office) యువకులు దాడికి దిగారు. పెండింగ్ బిల్లుల వసూలుకు విద్యుత్ ఉద్యోగులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా దొంగతనంగా విద్యుత్ వాడుతున్న వారిని అధికారులు గుర్తించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులు హెచ్చరించడంతో యువకులు రెచ్చిపోయారు. కరెంట్ ఆఫీసులోకి వచ్చి ఉద్యోగులను చితకబాదారు. మొత్తం నలుగురు యువకులు కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.