
హైదరాబాద్ (hyderabad city woman congress president) సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితపై (kavitha) అధిష్టానం వేటు వేసింది. ఇటీవల గాంధీ భవన్‌లో సునీతా రావు (sunitha rao) కవిత మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్... కవితను సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించింది.
గత శనివారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.