నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

Published : Apr 19, 2022, 04:46 PM IST
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ పనులను మంగళవారం నాడు పరిశీలించారు. అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మిస్తున్న Telangana Secretariat పనులను మంగళవారం నాడు పరిశీలించారు. Pragathi Bhavan నుండి సచివాలయానికి చేరుకున్న సీఎం  KCR  కొత్త సెక్రటేరియట్ పనులను పరిశీలించారు. ఆరు అంతస్థుల సెక్రటేరియట్ నిర్మాణ  పనులు పూర్తయ్యాయి. అయితే వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ పనులను పరిశీలించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం రద్దైంది. దీంతో  ఇవాళ సెక్రటేరియట్ కు సీఎం వచ్చారు.  సెక్రటేరియట్ లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు సీఎం కేసీఆర్ చేశారు.

ప్రస్తుతం సెక్రటేరియట్ లో ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఈ పనులకు సంబంధించి సీఎం పరిశీలించారు. మరో వైపు సెక్రటేరియట్ లో ఉపయోగించే మార్బుల్స్ డిజైన్లకు సంబంధించి కూడా అధికారులు సీఎంకు వివరించనున్నారు.ఈ విషయమై సీఎం కేసీఆర్ వాటిని కూడా పరిశీలించనున్నారు.సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రస్తుతం మూడు షిప్టుల్లో జరుగుతున్నాయి. ఏ ఒక్క రోజూ కూడా పనులు నిలిపివేయకుండా చేస్తున్నారు. 

కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన పరిశీలించారు.కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. 
 నిర్మాణంలో ఉన్న మినిస్టర్‌ చాంబర్లు, పార్కింగ్‌ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్‌ తదితర పనులకు సూచనలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?