అన్నాచెల్లెళ్లుగా ఉంటుంటే.. ప్రేమికులుగా ప్రచారం.. జంట ఆత్మహత్యాయత్నం, యువకుడు మృతి...

By Bukka SumabalaFirst Published Aug 11, 2022, 1:20 PM IST
Highlights

అన్నాచెల్లెళ్లలా ఉంటున్న ఓ జంట మీద కొంతమంది ప్రేమికులంటూ ప్రచారం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన వారు ఆత్మహత్యాయత్నం చేశారు. 

నిజామాబాద్ : అన్నా చెల్లెలుగా ఉంటున్న తమ మీద ప్రేమికుల అంటూ ముద్ర వేశారని మనస్తాపం చెందిన ఓ ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ లో జరిగింది. మూడో ఠాణా ఎస్సై  భాస్కరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ కు చెందిన యువకుడు (22) నిజామాబాదులో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17)  నిజామాబాదులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది.

ఒకే ఊరు కావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకుంటూ ఉండటం, కలుసుకుంటూ ఉండటంతో కొంతమంది వీరిని ప్రేమికులు అంటూ  ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో వీరిద్దరు మనస్తాపం చెందారు. తామిద్దరూ అన్నాచెల్లెళ్లలాగా ఉంటున్నామని..  ఇలా ప్రచారం చేయడంతో  తాము తీవ్రంగా బాధ పడ్డామని ఉత్తరం రాసి.. ఈ నెల 8న.. రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఇద్దరు  గడ్డి మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.  

అయితే అటుగా వెడుతున్న స్థానికులు వీరిని గుర్తించారు. వీరి ప్రయత్నం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. మూడో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Munugode bypoll 2022:మాణికం ఠాగూర్ తో చెరుకు సుధాకర్ భేటీ

ఇదిలా ఉండగా, తిరుపతిలో వావివరసలు, వయసుతేడాలు మరిచిన ఘటనలో ఓ 60 ఏళ్ల వృద్ధుడు హతమయ్యాడు. 63యేళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టే వేధింపులు భరించలేక బాలిక కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు తిరుపతి పడమర డిఎస్పి బారిక నరసప్ప పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన స్థానిక ఉల్లిపట్టెడలో టీటీడీ విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

‘ముత్యాల రెడ్డి సమీపంలోని ఉల్లిపట్టెడలో విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి (63) నివసిస్తున్నారు. అతని పక్కింట్లో వున్న ఓ బాలిక(16) మీద అతని కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ కుటుంబం పెద్దలను అడిగారు. అంత వయసు తేడా ఉంటే ఎలా పెళ్లి చేస్తామని వారు నిరాకరించారు. తరువాత జరిగిన గొడవలో తన బంగారు గొలుసును బాలిక తల్లి, తమ్ముడు కాజేశారని నారాయణస్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళను స్టేషన్ చుట్టూ తిప్పించ్చాడు.  అంతటితో ఆగకుండా ఓ రోజు ఆ బాలిక చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళేందుకు ప్రయత్నించాడు.  

దీంతో కుటుంబ సభ్యులు నారాయణ హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 7వ తేదీ  రాత్రి 11.30 గంటలకు నారాయణస్వామి ఆహారం కోసం బయటకు రాగా బాలిక పెద్దమ్మ భారతి(51) అతని వద్దకు వెళ్లి రెండు చేతులు పట్టుకుంది. అదే కుటుంబానికి చెందిన హేమాద్రి(20), రమేష్(47) తీసుకొచ్చిన వీపుపై ఐదు సార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈనెల 10వ తేదీ రామానుజపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 

click me!