నిజామాబాద్ కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం..

Published : May 09, 2022, 01:41 PM ISTUpdated : May 09, 2022, 02:31 PM IST
నిజామాబాద్ కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం..

సారాంశం

నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రజావాణి కార్యాక్రమానికి వచ్చిన యువతి యాసిడ్ తాగి ప్రాణాలు తీసుకోవాలని చూసింది. అయితే ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రజావాణి కార్యాక్రమానికి వచ్చిన యువతి యాసిడ్ తాగి ప్రాణాలు తీసుకోవాలని చూసింది. అయితే ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే స్థానికంగా నివాసం ఉండే నాందేవ్ అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని యువతి ఆరోపించింది. అయితే తాను ఒప్పుకోకపోవడంతో వేధింపులు మరింతగా పెంచాడని ఆమె చెప్పింది. 

తనను మంత్రగత్తె అని ప్రచారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్యకు యత్నించినట్టుగా ఆమె చెప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఓ రైతు కూడా ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కబ్జా చేస్తున్నారని చిన్నయ్య అనే రైతు ఆరోపించారు. తన భూమిని మధుశేఖర్, పెద్దోళ్ల గంగారెడ్డి కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన చిన్నయ్య... ఆత్మహత్యయత్నం చేశారు. రైతు చిన్నయ్యను అదుపులోకి తీసుకన్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు