వాకింగ్ వెళ్లిన యువనటికి వేధింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు..

Published : Mar 02, 2023, 11:42 AM IST
వాకింగ్ వెళ్లిన యువనటికి వేధింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు..

సారాంశం

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వచ్చిన ఓ యువనటిని వేధించాడో యువకుడు. వెంబడిస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

బంజారా హిల్స్ :  సెలబ్రిటీలు కనబడితే చాలు వారిని ఏదో రకంగా వేధించాలని ప్రయత్నించే ఆకతాయిలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. అలాంటి ఓ ఘటనే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వచ్చిన ఓ యువనటిని..  ఓ అగంతకుడు ఇలాగే వెంబడించి వేదించాడు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే, ఈ నటికి ఇదే పార్కులో గతంలో కూడా ఓచేదు అనుభవం ఉంది.

హ్యాట్సాఫ్ పోలీస్... గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన యువకున్ని కాపాడిన కానిస్టేబుల్ 

అంతకుముందు ఒకసారి వాకింగ్ కు వచ్చినప్పుడు ఓ దుండగుడు ఆమెను బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో ఉండే కేబీఆర్ పార్కుకు బుధవారం రాత్రి వాకింగ్ కి వచ్చింది. పార్కు లోపల రాత్రి 7 గంటల సమయంలో ఆమె వాకింగ్ చేస్తుంటే ఆమెను ఓ యువకుడు వెంబడించాడు. తనని ఎవరో వెంబడిస్తున్నట్లుగా అనిపించిన ఆమె.. యువకుడిని గమనించి ఒకచోట ఆగిపోయింది.  ఆ యువకుడు కూడా అక్కడే నిలబడిపోయాడు.  

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదారు సార్లు జరిగింది. ఆ యువకుడు ఆమెనే వెంబడిస్తున్నాడు. దీంతో ఆమె తనతో పాటు వాకింగ్ చేస్తున్న మిగతా వారికి ఈ విషయం చెప్పి అలర్ట్ చేసింది.  వారు వెంటనే పార్కు సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ యువకుడిని గమనించి పట్టుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తి పేరు శేఖర్ అని పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu