నీవు లేక నేను బతకలేనని.. ప్రాణ స్నేహితుడి ఆత్మహత్యను తట్టుకోలేక యువకుడి బలవన్మరణం..

By Asianet News  |  First Published Oct 6, 2023, 8:39 AM IST

ప్రాణ మిత్రుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో విషాదం నింపింది. ప్రాణ స్నేహితులు ఇద్దరు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.


స్నేహితుడి ఆత్మహత్యను తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల కిందట గోదావరిలో దూకగా.. గురువారం డెడ్ బాడీ లభ్యమైంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్ ఆర్కే - 8 కాలనీలో సందిపనేని మోహన్ (30), అఖిల్ చిన్నప్పటి నుంచే ప్రాణ మిత్రులు. కలిసే చదువుకున్నారు. ఎక్కడికెళ్లినా, ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎప్పుడూ దూరంగా ఉండకపోయేవారు.

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య.. భువనగరిలో ఘటన

Latest Videos

కాగా.. అఖిల్ కు నాలుగు నెలల కిందట మంచిర్యాలకు చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. అయినా స్నేహితుల మధ్య మైత్రి తగ్గలేదు. ఇద్దరూ కలిసే తిరిగేవారు. ఒకరింటికి ఒకరు వచ్చి వెళ్లేవారు. పెళ్లి జరిగినప్పటికీ స్నేహితులిద్దరూ ఇంకా గతంలో ఉన్నట్టే ఉండటం అఖిల్ భార్యకు, కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ఈ విషయంలో పలు మార్లు అఖిల్ దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పెళ్లి వల్ల తమ స్నేహం విడిపోవాల్సి వస్తోందని అఖిల్ మనస్థాపం చెందాడు. గత సోమవారం ఇంట్లో బలవన్మరణానికి ఒడిగట్టాడు. 

విషాదం.. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం.. కలహాలతో దంపతుల బలవన్మరణం?

అయితే స్నేహితుడి మరణాన్ని మోహన్‌ తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తాను గోదావరిలో దూకి చనిపోతున్నానంటూ తన కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం సాయంత్రం సమయంలో గోదావరిలో దూకాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కూతురుపై సవతి తండ్రి అత్యాచారం.. రెండేళ్లుగా నరకయాతన

అయితే మోహన్ టూ వీలర్ గోదావరి నది సమీపంలో లభ్యమవడం, అతడి సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అక్కడే చూపిస్తుండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయం తీసుకొని గోదావరిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే గురువారం మధ్యాహ్నం సమయంలో డెడ్ బాడీ లభ్యం అయ్యింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు చనిపోవడంతో స్థానిక గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

click me!