Yoga Day: ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రిలో ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్స‌వం

Published : Jun 20, 2026, 10:09 PM IST
Yoga Day

సారాంశం

Yoga Day: హైదరాబాద్ లోని ఆధునిక జీవనశైలిలో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఎంతో అవసరం అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అజింక్య డి.వై. పాటిల్ హెల్త్‌కేర్‌ ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఎస్.ఎల్.జీ హాస్పిటల్ ఛైర్మన్ దండు శివరామరాజు మాట్లాడుతూ.. "ప్రపంచంలో అందరూ యోగ నేర్చుకోవాలి అని అన్నారు. వేల సంవత్సరాల క్రితం యోగ మొదలైంది అదే పాత పద్ధతుల్లో యోగా కంటిన్యూ అవుతున్న ఆ తర్వాత ప్రపంచ దేశాలు అంత యోగాని బాగా ఇంప్రూవ్ చేశారు, యోగా చేయడం వల్ల ఆరోగ్యం కూడా మీరుగు అవుతుంది, యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మంచి డైట్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన తిండి తినడం, ఉదయం లేచి కనీసం 45 నిముషాలు నడవటం వల్ల మనుషులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. నాకు 75 సంవత్సరాలు నేను ఎప్పటికి యోగతో పాటు వ్యయం, ధ్యానం ప్రతి రోజు చేస్తాను." అన్నారు.

యోగ ఫర్ హార్మనీ, హెల్త్ అండ్ హ్యాపినెస్

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా “యోగ ఫర్ హార్మనీ, హెల్త్ అండ్ హ్యాపినెస్” అనే ప్రధాన అంశంతో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆవరణలోని ప్రశాంత వాతావరణంలో ఉద‌యం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది.ఈ యోగా సెషన్‌లో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు, ఆరోగ్యం పై ఆసక్తి కలిగిన ప్రజలు సహా మొత్తం 290 మంది పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.

పాల్గొన్నవారు వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించి యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.యోగాసనాలు, ప్రాణాయామాలను సరైన విధానంలో నేర్పించేందుకు ప్రముఖ సర్టిఫైడ్ యోగా శిక్షకులు శ్రీదేవి, శ్రీహరి, వి. చలపతి, సంతోష్ కుమార్ మహాపాత్ర మార్గదర్శకత్వం వహించారు. వారు యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించి, ప్రతిరోజూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, పాల్గొన్న వారందరూ యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సంకల్పించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

LPG: ఇక‌పై ఇళ్ల‌లో గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కేంద్రం కీల‌క అడుగులు
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు