
హైదరాబాద్: New Year సందర్భంగా Liquor తాగి వాహనాలు నడుపుతూ సుమారు 2,500 మంది పట్టుబడ్డారని Hyderabad ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హైద్రాబాద్, Cyberabad , Rachkonda పోలీస్ కమిషనరేట్లలో 2543 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ policeకు చిక్కారు. అయితే అత్యధికంగా హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో 1300 మంది పోలీసులకు చిక్కారు.
సైబరాబాద్ లో 873 మంది పోలీసులకు చిక్కగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 370 కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని హైద్రాబాద్ నగరంలోని సుమారు 150కి ప్రాంతాల్లో check posts ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31తో పాటు జనవరి 1వ తేదీన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనదారులను చెక్ చేశారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే పేరుతో పెద్ద ఎత్తున మందు పార్టీలు నిర్వహించారు. మందు పార్టీల్లో మందు తాగి వాహనాలు నడుపుతూ చెక్ పోస్టుల వద్ద పోలీసులకు చిక్కారు మందు బాబులు.
మద్యం తాగుతూ వాహనాలను నడపకుండా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలాన్లు విధించి వాహనాలను సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని 22 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య యువకులు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ AV Ranghanath తెలిపారు.మరో వైపున ఈ తరహా తనిఖీలను కొనసాగిస్తామని రంగనాథ్ తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో 873 కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు.873 మంది మద్యం తాగుతూ పట్టుబడ్డారని ఆయన చెప్పారు.సైబరాబాద్ పరిధిలోని చెక్ పోస్టులను ఎప్పటికప్పుడు మార్చామని ఆయన తెలిపారు.
రాచకొండ, ఎల్బీనగర్, ఉప్పల్, యాదాద్రి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 379 మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
also read:హైద్రాబాద్ ఎల్బీనగర్‌లో మందుబాబుల వీరంగం: కాలనీ వాసులపై దాడి, నర్సింహరెడ్డి అనే వ్యక్తి మృతి
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. డిసెంబర్ 31న భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క రోజులోనే రూ.171 కోట్ల మందు అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
డిసెంబర్ లోనే 3,435 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది..గతేడాది చివరి నెలలో 2,764 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది మొత్తం 25,602 కోట్ల మందు అమ్ముడుపోయిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే ఏడాది శుక్రవారం నాటికి కలుపుకొని 30,196 కోట్ల విలువైన మందు అమ్ముడైంది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు దసరాతో పాటు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి ఏటా లిక్కర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయని ఎక్సైజ్ శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.