ప్రాణాలతో పోరాడుతున్న ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక: హెల్త్ బులెటిన్ విడుదల

Published : Feb 13, 2019, 06:53 PM IST
ప్రాణాలతో పోరాడుతున్న ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక: హెల్త్ బులెటిన్ విడుదల

సారాంశం

ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్రిటికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఫిబ్రవరి 6 బుధవారం నాడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మధులికపై భరత్ అనే ప్రేమోన్మాది బర్కత్ పురాలో దాడికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న మధులిక ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. 

ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్రిటికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఫిబ్రవరి 6 బుధవారం నాడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మధులికపై భరత్ అనే ప్రేమోన్మాది బర్కత్ పురాలో దాడికి పాల్పడ్డాడు. 

ఈ దాడిలో మధులిక తీవ్ర గాయాలపాలైంది. ఆమె పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్ కండీషన్లోనే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే యశోద ఆస్పత్రి వైద్యులు మధులికకు శస్త్రచికిత్సలు చేశారు కూడా. మరోవైపు నిందితుడు భరత్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.  

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?