(వీడియో)  ‘MEK’ దోపిడీ ఆట అంటున్న యండమూరి

Published : Feb 20, 2017, 08:13 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
(వీడియో)  ‘MEK’ దోపిడీ ఆట అంటున్న యండమూరి

సారాంశం

యండమూరి కోపం మెగా ఫ్యామిలీ పైనా... మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంపైనా... నాగుబాబు సెటైర్ల తర్వాతే ఈ ప్రొగ్రాం గురించి  వ్యక్తిత్వ వికాస నిపుణుడికి తెలిసొచ్చిందా... నాగార్జున ఉన్నప్పుడు ఈ దోపిడీ గుర్తుకురాలేదా అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మన దగ్గర డబ్బులు తీసుకొని మన గురించి మనకు చెప్పేవాళ్లే వ్యక్తిత్వ వికాస నిపుణులు. సమాజంలో అలాంటి వ్యక్తిత్వ వికాస నిపుణులకు మంచి పేరుంది. అందులో తెలుగునాట ప్రసిద్ధ రచయితగా పేరున్న యండమూరి వీరేంద్రనాథ్ ఒకరు.

 

నవలా రచయితగా ఆ తర్వాత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన అనేక పుస్తకాలు రాశారు. విజయానికి ఐదు మెట్లు లాంటి ఆయన పుస్తకాలు లక్ష కాపీల వరకు అమ్ముడుపోయి రికార్డు కూడా సృష్టించాయి.

 

సినీ రచయితగాను యండమూరి రాణించారు. ఆయన నవలలు కొన్ని చిరంజీవి హీరోగా సినిమాలుగా కూడా వచ్చాయి.

 

ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా వేడుకల సందర్భంలో యండమూరిపై మెగా బ్రదర్ నాగుబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. యండమూరి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విరుచపడ్డారు.

 

ఈ ఎపిసొడ్ఇక్కడితో ఆయిపోయింది అనుకుంటే యండమూరి ఇప్పుడు ఓ కౌంటర్ అటాక్ తో  ముందుకు వచ్చారు. మా టీవీలో మీలో ఎవరూ కోటీశ్వరు ప్రొగ్రాం వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో నాగార్జున దీనికి వ్యాఖ్యాతగా ఉండగా ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి వచ్చారు.

 

 

అయితే ఈ కార్యక్రమంపై యండమూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి నుంచి రూ. 15 వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే నాగార్జున ఉన్నప్పుడు ఈ విషయం యండమూరికి తెలియదా... ఇప్పుడే ఆ ప్రొగ్రాం గురించి ఎందుకు స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యాతగా మారినప్పుడే ఈ మోసం గురించి తెలిసిందా  అనేదే మెగా అభిమానుల ప్రశ్న.

 

 

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ