అమ్మ.. చిన్నమ్మ.. ఓ రాములమ్మ

First Published Feb 19, 2017, 1:42 PM IST
Highlights

తమిళనాట నుంచే వెండి తెరకు పరిచయమైన రాములమ్మ తెలుగునాట సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం సీన్ రివర్స్ చేయాలని చూస్తున్నారేమో...

తెలంగాణ మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఈ మధ్య తమిళ రాజకీయలపై నే ఎక్కువగా  స్పందిస్తన్నారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఒక్కసారి కూడా ఆమె నోట వెంట ఒక్క తెలంగాణ సమస్య కూడా రాలేదు.

 

జయలలిత స్ఫూర్తిగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకునే విజయశాంతి... ‘అమ్మ’ మృతి తర్వాత తమిళనాడుకు వెళ్లి చిన్నమ్నను పరామర్శించిన విషయం తెలిసిందే.

 

కాంగ్రెస్ పార్టీ లో ఉన్నా ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లోనూ రాములమ్మ పాల్గొనడం లేదు.

 

ఈ నేపథ్యంలోనే ఆమె తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశిస్తారని .. అన్నా డీఎంకే పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అలాంటివేమీ జరగలేదు.

 

కాగా, అన్నాడీఎంకేకి చెందిన పళనిస్వామి సీఎం అవడంపై ఆమె ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పన్నీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

పన్నీరును ఓ దుష్టశక్తిగా అభివర్ణించారు. అతడి నుంచి పార్టీని రక్షించిన చిన్నమ్మను అభినందించారు. ఆమె ఇకపై ముందుండి అన్నాడీఎంకేను నడింపిచాలని అన్నారు.

 

తెలంగాణ రాజకీయాల్లో ఉంటూ ఇక్కడ సమస్యలపై రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా స్పందించన రాములమ్మ తమిళ రాజకీయాలపై ఇటీవల ప్రతిసారీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

 

తమిళనాట నుంచే వెండి తెరకు పరిచయమైన రాములమ్మ తెలుగునాట సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం సీన్ రివర్స్ చేయాలని చూస్తున్నారేమో...

click me!