ప్రియుడితో వివాహిత జంప్: కూతురిని చంపేందుకు తండ్రి యత్నం

Published : Jul 14, 2019, 03:03 PM IST
ప్రియుడితో వివాహిత జంప్: కూతురిని చంపేందుకు తండ్రి యత్నం

సారాంశం

పెళ్లైన తర్వాత  ప్రియుడితో పారిపోయిన కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకొంది.  యువతి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

చౌటుప్పల్: పెళ్లైన తర్వాత  ప్రియుడితో పారిపోయిన కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చోటు చేసుకొంది.  యువతి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి తన రెండో కూతురికి గత నెల 14వ తేదీన పెళ్లి జరిపించాడు. పెళ్లికి ముందు ఆ యువతికి వేరే యువకుడిని ప్రేమిస్తోంది.

పెళ్లైన తర్వాత  ఆ  యువతిని ప్రేమికుడు తీసుకెళ్లాడు. దీంతో  అత్తింటివాళ్లు పంచాయితీ పెట్టారు.  ప్రేమికుడితో వెళ్లిపోయిన కూతురును  ఇంటికి తీసుకెళ్లాలని యువతి పుట్టంటి వాళ్లకు సమాచారం  పంపారు. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఘటనతో  పరువు పోయిందని ఇబ్బందిపడిన తల్లిదండ్రులు కూతురిని గొంతు నులిమారు. ఆమె చనిపోయిందని భావించి సన్నహితులకు సమాచారం ఇచ్చారు. 

అయితే  ఈ సంఘటనస్థలానికి చేరుకొనేసరికి ఆ యువతి ఇంకా బతికే ఉంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉంది.యువతి తండ్రి చౌటుప్పల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్