
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణల మీద సరూర్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా భువనగిరి డివిజన్ పరిధిలోని Yadagiri Gutta రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్ లోని ఓ మహిళా పోలీస్ తో Obsceneగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నర్సయ్య ప్రవర్తన మీద సదరు మహిళా పోలీస్ పై అధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాము పోలీసులం.. అధికారం మా చేతుల్లో ఉంటుందనే అహమో.. తమకింద పనిచేస్తున్న మహిళల పట్ల చిన్నచూపో తెలియదు కానీ.. మహిళలకు రక్షణ కల్పించాల్సిన Police Station లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.
దారుణం.. నోట్లో నుంచి ‘ఉమ్ము’ పడిందని.. చిన్నారిని చితకబాదిన టీచర్...
నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్ గా ఉన్న ఇన్ స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరి గుట్ట రూరల్ సీఐగా Transfer చేశారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వలు జారీ చేశారు.
అనంతపురంలో మరో దారుణం..
ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుని పోలీస్ శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ ను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సస్పెండ్ చేశారు. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన హర్షవర్ధన్ రాజు(2018వ బ్యాచ్) అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
ఈయనకు కల్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. దీంతో కట్న కానుకల కింద రూ.20 లక్షల నగదు, పది తులాల బంగారం, కారు ఇచ్చినట్లు సమాచారం.
కాగా, హర్షవర్ధన్ రాజుకు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది Extramarital affairకి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవాడు.
ఓ రోజు గట్టిగా నిలదీయగా.. ‘Police Departmentలో ఇటువంటివి సహజం. లైట్ గా తీసుకోవాలి’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటకి వెళ్లింది. భార్యను తిరిగి తీసుకురావడానికి ఆయన ఏనాడూ వెళ్లలేదు. చివరకు పెద్దలు పంచాయతీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు.
దీంతో Victim, ఆమె తండ్రి బ్రహ్మ సముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా Suspension వేటు వేశారు.