Yadadri Temple: యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం.. 25 రోజుల్లో ఏకంగా రూ. 2.32 కోట్లు

By Mahesh K  |  First Published Jan 30, 2024, 9:23 PM IST

యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ సమకూరింది. 25 రోజుల్లో ఏకంగా రూ. 2.32 కోట్ల డబ్బు వచ్చింది. అలాగే.. 230 గ్రాముల బంగారం, 4.420 కిలోల వెండీ కూడా హుండీలో భక్తులు సమర్పించుకున్నారు.
 


యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి హుండీ ద్వారా కోట్ల ఆదాయం సమకూరింది. కేవలం 25 రోజుల్లోనే రూ. 2,32,33,689 విరాళాలుగా వచ్చాయి. జనవరి 4వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య భక్తులు ఈ మేరకు నగదు హుండీలో వేశారు. ఈ డబ్బుతోపాటు ఇంకా గిఫ్ట్‌లు, వేరే దేశాల కరెన్సీ, బంగారం, వెండి కూడా హుండీలో సమర్పించారు.

ఈ నెల 4వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో రూ. 2.32 కోట్ల డబ్బు హుండీలో భక్తులు సమర్పించుకున్నారు. వీటితోపాటు 230 గ్రాముల బంగారం, 4.420 కిలోల వెండీ కూడా ఆలయానికి హుండీ ద్వారా వచ్చింది. అలాగే, 593 అమెరికన్ డాలర్లు, 65 యూఏఈ దిర్హమ్‌లు, 65 ఆస్ట్రేలియన్ డాలర్లు, 220 కెనడియన్ డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 10 బ్రిటీష్ పౌండ్లు, 122 సౌతాఫ్రికా ర్యాండ్లు, 15 యూరోపియన్ యూరోలు, 400 ఓమనీ రియాల్స్ ఇంకా పలు దేశాల కరెన్సీ హుండీకి వచ్చింది.

Latest Videos

Also Read: Kumari Aunty: వైసీపీ ప్రచారంలో సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ.. ఆమె ఏమన్నారంటే?

ఈ మొత్తాన్ని ఈవో రామక్రిష్ణ రావు పర్యవేక్షణలో ఆలయ అడ్మినిస్ట్రేషన్ ఆలయ ట్రెజరీలో జమ చేశారు.

click me!