నాగు పాముకు ఎక్స్ రే.. విరిగిన ఎముకకు సిమెంట్ పట్టీ..

Published : Mar 21, 2022, 09:08 AM IST
నాగు పాముకు ఎక్స్ రే.. విరిగిన ఎముకకు సిమెంట్ పట్టీ..

సారాంశం

పశుపక్ష్యాదులను కూడా కరుణతో చూడడమే అసలైన మానవత్వం. అలాంటి మానవత్వంతో కూడిన సంఘటనలు అప్పుడప్పుడు, అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే ఇది.. గాయపడిన ఓ పామును రక్షించాడో జంతు ప్రేమికుడు.. అంతేకాదు దాని గాయానికి పట్టీ కట్టి మరీ సంరక్షస్తున్నాడు.. 

వనపర్తి : king cobra అంటేనే భయంతో పరుగులు పెడతారు కానీ సర్పరక్షకుడిగా పేరొందిన Sagar Snake Society వ్యవస్థాపకుడు, హోంగార్డ్ కృష్ణసాగర్ తీరే వేరు. ఎక్కడైనా  పాము కనిపించింది అని ఫోన్ వస్తే.. తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఆదివారం వనపర్తి పట్టణం నాగవరం  శివారులో కదిరెపాడు ధర్మయ్య ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా..  మట్టిపెళ్లలు పడి నాగుపాముకు గాయం అయ్యింది.  ఇది గమనించిన వారు కృష్ణ సాగర్ కు సమాచారం ఇచ్చారు.
 
గాయంతో పాము ఇబ్బంది పడుతుండడం చూసి ఆయన 
Veterinarian ఆంజనేయులును ఆశ్రయించారు. ‘దాని ఎముక విరిగినట్టుంది ఎక్స్రే తీస్తే కానీ వైద్యం చేయలేం’ అని డాక్టర్లు తేల్చారు. చివరికి డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రిలో పాముకు ఎక్స్రే తీశారు. పాముకు ఎముక విరగడంతో సిమెంట్ కట్టు వేశారు. దానికి చికిత్స పూర్తయ్యాక వనపర్తి చిట్టడవిలో వదిలేస్తానని కృష్ణసాగర్ తెలిపాడు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే రాజమహేంద్రవరంలో నిరుడు నవంబర్ లో జరిగింది. Rajamahendravaramలో జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి, దాన్ని పట్టుకుని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 stitches వేసి ఇంజక్షన్లు ఇచ్చారు. ఇది ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలో అటవీ ప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు. 

మరోవైపు, పాము కాటుతో చనిపోయేవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. నవంబర్, 2021 మొదట్లో తెలంగాణలోని mahabubabad జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. మహబూబాబాద్‌ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురు snake biteకు గురయ్యారు. తల్లిదండ్రులతో పాటు చిన్నారిని పాము కాటేసింది. నవంబర్ 7న జరిగిన ఈ ఘటనలో 3 నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. అయితే ఈ ఘటనలో చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాలు.. శనిగపురానికి చెందిన మమత, క్రాంతి దంపతులకు 3 నెలల పాప ఉంది. ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి పాప నోటి వెంట నురగ రావడం చూసిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. పాప మృతి చెందినట్టుగా వైద్యులు నిర్దారించారు.మరోవైపు పాపకు కప్పి ఉంచిన దుప్పటి నుంచి పాము బయటపడింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లిదండ్రులు మమత, క్రాంతి కూడా స్పృహ కోల్పోయారు. దీంతో వారిని కూడా పాము కాటేసిందని నిర్దారణకు వచ్చిన వైద్యులు.. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల చిన్నారి పాము కాటుతో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఈ విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu