మంచిరేవుల ఫామ్‌హౌస్‌‌లో పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌కు ఊరట.. బెయిల్ మంజూరు

By Siva KodatiFirst Published Nov 10, 2021, 4:19 PM IST
Highlights

మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో (manchirevula farmhouse case) పేకాట దందా కేసులో అరెస్ట్ అయిన హీరో నాగశౌర్య (hero naga shourya father) తండ్రి శివలింగ ప్రసాద్‌కు (shivalinga prasad) న్యాయస్థానం బెయిల్ (bail) మంజూరు చేసింది. 

మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో (manchirevula farmhouse case) పేకాట దందా కేసులో అరెస్ట్ అయిన హీరో నాగశౌర్య (hero naga shourya father) తండ్రి శివలింగ ప్రసాద్‌కు (shivalinga prasad) న్యాయస్థానం బెయిల్ (bail) మంజూరు చేసింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉప్పర్‌పల్లి కోర్ట్ (upparpally court) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో శివలింగప్రసాద్‌ను  బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నవిషయమై సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు చేశారు.  ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో ఇవాళ శివలింగ ప్రసాద్  పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు.

పుట్టినరోజు వేడకల కోసం సుమన్ ఈ ఫామ్‌హౌస్ ను అద్దెకు తీసుకొన్నాడు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట  ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు Sot పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు  పోలీసులకు చిక్కారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో  gutta suman kumar కు సంబంధాలున్నాయని  దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 

ALso Read:మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట : హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్

పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారోననే విషయమై సుమన్ కుమార్ సమాచారం చేరవేసేవాడు. డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనేవాడు. ఈ డబ్బులను తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ ను ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు.ఈ నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.కస్టడీలో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు.హైదరాబాద్‌లోనే కాకుండా దేశ, విదేశాల్లో సుమన్ కుమార్ కేసినో ఆడించినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గోవా, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్ లో కెసినో అడించినట్టు పోలీసుల  ముందు సుమన్  ఒప్పుకొన్నారని సమచారం. ప్రతిరోజు 600 మందికి కెసినో మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. సుమన్ పై ఇప్పటికే ఐదు ఫిర్యాదులు కూడా ఉన్నాయని తమను మోసం చేసారని బాధితులు ఫిర్యాదు చేసినట్టు  పోలీసులు పేర్కొన్నారు.

గతంలో కూడా మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని స్టార్ హోటల్స్ ను కూడా పవన్ కుమార్  లీజుకు తీసుకొని పేకాట ఆడించినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ప్రముఖులను గోవాతో పాటు ఇతర ప్రాంతాలకు టూర్లకు తీసుకెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. మరో వైపు సుమన్ కుమార్ పై ఉన్న కేసుల గురించి కూడా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు.  ఏపీ పోలీసులు నార్సింగి పోలీసులకు  కీలక సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గత వారంలో బేగంపేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పేకాట ఆడుతున్న విషయం వెలుగుచూసింది. అగర్వాల్ అనే వ్యక్తి పేకాట నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

click me!