రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భూవివాదం.. బౌన్సర్లపై తిరబడిన మహిళా రైతులు..

Published : Jan 09, 2023, 05:28 PM IST
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భూవివాదం.. బౌన్సర్లపై తిరబడిన మహిళా రైతులు..

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌‌ గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బౌన్సర్లపై మహిళా రైతులు తిరగబడ్డారు.

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌‌ గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో వివాదం  కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి హైకోర్టులో కూడా కేసు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వివాదస్పద భూమిని చూసేందుకు రైతులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకున్నారు. అయితే ఆ సమయంలోనే అక్కడ ఉన్న బౌన్సర్‌‌లు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మహిళా రైతులు బౌన్సర్లపై తిరగబడ్డారు. బౌన్సర్లను వెంటపడి అక్కడి నుంచి తరిమికొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం
AI in Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో అధునాతన టెక్నాలజీ.. ఏఐతో మరింత కచ్చితత్వం