తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌తో రేవంత్ రెడ్డి భేటీ: పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు

By narsimha lode  |  First Published Jan 9, 2023, 5:08 PM IST

తెలంగాణ డీజీపీ  అంజనీకుమార్ తో  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఇవాళ భేటీ అయ్యారు.  పార్టీ మారిన  12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సీబీఐకి బదిలీ చేయాలని  రేవంత్ రెడ్డి  కోరారు. 


హైదరాబాద్: తెలంగాణ డీజీపీ  అంజనీకుమార్ తో  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిలు సోమవారంనాడు  భేటీ అయ్యారు. పార్టీ మారిన  12 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై  కేసు నమోదు చేసి   సీబీఐకి  బదిలీ  చేయాలని కోరారు.

ఈ నెల  6వ తేదీన  మొయినాబాద్ పోలీ స్టేషన్ లో  ఈ విషయమై  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్  బృందం   ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై  డీజీపీతో  కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మరో వైపు  నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  నిన్న  కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి కూడా  కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు  చేయనున్నారు. 

Latest Videos

undefined

2022 అక్టోబర్  26న మొయినాబాద్ ఫాం హౌస్ లో  బీఆర్ఎస్ కు చెందిన నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి చేస్తున్నారని  కేసు నమోదైంది.  అచ్చంపేట  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు,  తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిలను  ప్రలోభాలకు  గురి చేస్తున్నారనే ఆరోపణలతో  ముగ్గురు  అరెస్టయ్యారు.   రామచంద్రభారతి,  సింహయాజీ, నందకుమార్ లను  ఈ కేసులో  పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో   ఈ ముగ్గురికి  హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు  2022 డిసెంబర్   26న ఆదేశాలు జారీ చేసింది.   ఈ కేసు విచారణను సీబీఐకి  ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం  హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.  

also read:పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు:మొయినాబాద్ పోలీసులకు కాంగ్రెస్ కంప్లైంట్

ఇదిలా ఉంటే  2018 తర్వాత  కాంగ్రెస్ పార్టీకి చెందిన  12 మంది ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ లో  చేరారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలకు  ప్రయోజనం కలిగిందని  కాంగ్రెస్ నేతలు  ఆరోపిస్తున్నారు.ఈ విషయమై  మొయినాబాద్ పోలీసులకు వివరాలతో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్  చేస్తుంది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో పాటు  ఈ కేసును కూడా విచారించాలని  సీబీఐని కోరుతామని కాంగ్రెస్ నేతలు గతంలోనే ప్రకటించారు. మొయినాబాద్ పోలీసులకు  తాము ఇచ్చిన  ఫిర్యాదుపై కేసు నమోదు  చేసి సీబీఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేతలు  పోలీసులను కోరుతున్నారు. 
 

click me!