రైలు పట్టాలపై ప్రేమజంట.. చివరి నిమిషంలో ప్రియుడు పరార్, ప్రేయసి మృతి

Published : Apr 27, 2019, 12:27 PM ISTUpdated : Apr 27, 2019, 12:30 PM IST
రైలు పట్టాలపై ప్రేమజంట.. చివరి నిమిషంలో ప్రియుడు పరార్, ప్రేయసి మృతి

సారాంశం

ఒకరిని మరొకరు ప్రాణంగా  ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకొని జీవితాంతం  కలసి బతకాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కలిసి చచ్చిపోదామని అనుకున్నారు.

ఒకరిని మరొకరు ప్రాణంగా  ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకొని జీవితాంతం  కలసి బతకాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కలిసి చచ్చిపోదామని అనుకున్నారు. సూసైడ్ చేసుకుందామని రైలు పట్టాలమీద కూడా పడుకున్నారు. కానీ.. ఆఖరి నిమిషాన ప్రియుడు మనసు మార్చుకున్నాడు. భయంతో పట్టాల మీద నుంచి లేచి పరిగెత్తాడు. యువతి మాత్రం పట్టాల మీదనే శవంగా మారింది. ఈ సంఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. 

 ఈ ప్రేమ జంటది హైదరాబాద్‌  పాతబస్తీగా గుర్తించారు పోలీసులు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రేమ జంట... రైలు పట్టాలపై పడుకున్నారు. రైలు వచ్చే సమయంలో ప్రియుడు పట్టాలపై నుంచి లేచి పరారు కావడంతో ప్రియురాలు మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు... ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్