బలవంతంగా పెళ్లి.. బెదిరించి కాపురం

Published : Mar 11, 2019, 10:42 AM IST
బలవంతంగా పెళ్లి.. బెదిరించి కాపురం

సారాంశం

బలవంతంగా తన మెడలో తాళి కట్టి పెళ్లిచేసుకున్నాడని.. తర్వాత బెదిరించి ఆరు నెలలుగా కాపురం చేస్తున్నాడని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

బలవంతంగా తన మెడలో తాళి కట్టి పెళ్లిచేసుకున్నాడని.. తర్వాత బెదిరించి ఆరు నెలలుగా కాపురం చేస్తున్నాడని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఈ బాధ నుంచి విముక్తి కల్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌(24) అనే యువకుడు గత అయిదు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి(19)ని ప్రేమిస్తున్నాడు. ఆరు నెలల క్రితం గుడికి వెళ్ళాలని అనిల్‌ ఆ యువతిని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాడు.

ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ఓ చెట్టు కింద ఆమె మెడలో తాళికట్టాడు. మరొకరితో పెళ్ళి కాకుండా చేశాడని తనతో రాకపోతే బతుకు ఆగమవుతుందంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ  యువకుడితో పాటు బాధిత యువతి అంబర్‌పేటకు వెళ్ళి కాపురం పెట్టింది. అయితే.. రోజూ బెదిరించి మరీ కాపురం చేసేవాడని యువతి  పేర్కొంది. 

ఈ మధ్య మద్యం సేవించి ఇంటికి వచ్చి మరింత వేధించసాగాడని యువతి పేర్కొంది. కాగా.. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త అనిల్ ని అరెస్టు చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu