కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే హరిప్రియా

By narsimha lodeFirst Published Mar 10, 2019, 7:42 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ఆ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.ఆ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా హరిప్రియా నాయక్ పోటీ చేసి విజయం సాధించారు.ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజల రుణం తీర్చుకోవాలన్నా.. అభివృద్ధిఫలాలు అందరికీ అందాలన్నా  ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని ఆయన చెప్పారు.

 

ఎన్నికల్లో తనకు సహకరించిన వారందరితో సంప్రదించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆమె చెప్పారు.అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ బీ ఫారంపై పోటీ చేసేందుకు కూడ సిద్దమేనని హరిప్రియానాయక్ ప్రకటించారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.తాజాగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. మరో వైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు కూడ టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని సమాచారం.

రెండు రోజుల్లో ఎమ్మెల్సీ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో  ఆ పార్టీ నేతలు ఆందోళ చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొంది. 

ఇద్దరు టీడీపీ సభ్యుల సహాయంతో ఎమ్మెల్సీని దక్కించుకోవాలని ప్లాన్ చేసింది. కానీ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టడంతో కాంగ్రెస్ నాయకత్వం ఆందోళనతో ఉంది.
 

 

click me!