ప్రియుడికి ఇదివరకే పెళ్లి.. తట్టుకోలేక గొంతు కోసుకున్న యువతి

Siva Kodati |  
Published : Feb 24, 2021, 06:28 PM ISTUpdated : Feb 24, 2021, 06:29 PM IST
ప్రియుడికి ఇదివరకే పెళ్లి.. తట్టుకోలేక గొంతు కోసుకున్న యువతి

సారాంశం

ప్రియుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం ప్రేమించిన యువకుడితో బాధితురాలు ఇంటి నుంచి వెళ్లిపోయింది

ప్రియుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో ఈ ఘటన జరిగింది.

కొద్దిరోజుల క్రితం ప్రేమించిన యువకుడితో బాధితురాలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే అతనికి ఇది వరకే పెళ్లయిందని తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించింది.

ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana