వామన్‌రావు కేసు: నిందితులకు ఏడు రోజుల పోలీసు కస్టడీ, కోర్టు ఆదేశాలు

By Siva KodatiFirst Published Feb 24, 2021, 5:20 PM IST
Highlights

తెలుగు నాట సంచలనం కలిగించిన హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో న్యాయస్థానం నిందితులను పోలీస్ కస్టడీకి  అనుమతించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై మంథని కోర్టు బుధవారం విచారణ జరిపింది

తెలుగు నాట సంచలనం కలిగించిన హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో న్యాయస్థానం నిందితులను పోలీస్ కస్టడీకి  అనుమతించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై మంథని కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో వీరిని పోలీసులు విచారించనున్నారు. 

కాగా, వామన్‌రావు కేసులో ప్రధాన నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హంతకులకు ఆయుధాలతో పాటు కారు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వామన్ రావు దంపతుల హత్యకు బిట్టు శ్రీను కుట్ర చేసినట్లు తేల్చారు.

శ్రీను నడుపుతున్న పుట్టా ట్రస్ట్‌పై వామన్ రావు కేసులు వేశారు. పిటిషన్‌లతో బిట్టు శ్రీను ఆదాయం కోల్పోయాడని.. దాంతో వామన్ రావుపై కక్ష పెంచుకున్నాడని చెప్పారు పోలీసులు.

ఆదాయ మార్గాలు గండి కొట్టినందుకు వామన్ ‌రావును హత్య చేసేందుకు బిట్టు శ్రీను కుట్ర చేశాడని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ రోజు లేదా రేపు అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం వుందని సమాచారం. ఈ హత్య కేసులో మొత్తం ఐదుగురి ప్రమేయం వున్నట్లు పోలీసులు తేల్చారు. కుంట శ్రీను, బిట్టు శ్రీను, చిరంజీవి, కుమార్‌లను ఇప్పటికే ఖాకీలు అరెస్ట్ చేశారు. 

click me!