
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా తూంకుంట గ్రామ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. జహీరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించింది. సగం కాలిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ వయసు 30యేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె ఎవరో ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.