మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు.
మెదక్ : తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. కంటైనర్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.