భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం

By narsimha lodeFirst Published Jul 14, 2021, 4:53 PM IST
Highlights


భూ వివాదం పరిష్కరించనందుకు గాను నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు ఓ మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో గుర్తించి ఆమెను అడ్డుకొని జేసీ వద్దకు తీసుకెళ్లారు. 
 

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఓ మహిళ  ఆత్మహత్యాయత్నం చేసుకొంది. అక్కడే పనిచేసే సిబ్బంది సకాలంలో గుర్తించి ఆమెను అడ్డుకొన్నారు. జిల్లాలోని బిజినేపల్లి మండలం సల్కర్‌పేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జ్యోతి భర్త మరణించాడు. తన భర్తకు వారసత్వంగా రావాల్సిన భూమి కోసం రెండేళ్ల నుండి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి తనకు దక్కకుండా తన బావ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ  విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె చెప్పారు.

ఇవాళ ఉదయం కిరోసిన్ డబ్బా పట్టుకొని  కలెక్టరేట్ కు చేరుకొంది. ఒంటిపై  కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకొన్నారు. ఆమెను జాయింట్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. తన బాధను ఆమె జాయింట్ కలెక్టర్ కు వివరించింది. ఆమెకు న్యాయం చేస్తానని జేసీ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మహత్యాయత్నం చేయవద్దని జేసీ  సూచించారు.

click me!