పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ హఠాత్తుగా మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మంలో విషాదాన్ని నింపింది. ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.
ఖమ్మం : హఠాత్తు మరణాల జాబితాలో మరో మహిళ చేరింది. ఖమ్మంలో అలాంటి ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అల్లిపురంలో పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆది గమనించిన మిగతావారు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. కాగా, ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్థారించారు.
ఇలా చనిపోయిన మృతురాలి పేరు రాణి అని సమాచారం. పెళ్లికి హాజరైన ఆమె ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేస్తుంది. అలా చేస్తూ చేస్తూ సడెన్ గా ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళ నృత్యానికి ఆనంద పడ్డ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి వేడుకలో విషాదం నిండుకుంది. రాణి మృతితో ఆమె కుటుంబసభ్యులు, బంధువుల శోకసంద్రంలో మునిగిపోయారు. రాణి మృతితో పెళ్లి ఊరేగింపును అర్థాంతరంగా నిలిపేశారు.
undefined
జిమ్ నుంచి వచ్చిన కాసేపటికి గుండెపోటు.. వాంతులు చేసుకుని యువకుడు మృతి..
ఇదిలా ఉండగా, మార్చి 11న ఖమ్మంలోనే ఓ యువకుడి ఇలాగే హఠాత్తుగా మృతి చెందాడు. గుండెపోటు మరణాల జాబితాలో మరో యువకుడు చేరాడు. కొట్టే మురళీకృష్ణ (26) అనే యువకుడు సినిమా చూస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి మరణించాడు. ఇంజనీరింగ్ చదువుకున్న మురళీకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు. వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు అతడిని కబలించింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కొట్టే మురళీకృష్ణ తాపీ మేస్త్రి, తల్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు. కొడుకును తమ తాహతుకు మించి కష్టపడి చదివించారు. అతను కూడా తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొట్టే మురళీకృష్ణది ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామం. తల్లిదండ్రులు కొట్టే పెద్దకృష్ణ, రాధా. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.
కొట్టే మురళీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆశతో దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కోర్సులు పూర్తి చేశాడు. ఇటీవల హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో మురళీకృష్ణ కు ఉద్యోగం కూడా వచ్చింది. ఈ నెల 17వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం సొంతూరికి వచ్చాడు మురళీకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారానని తల్లిదండ్రులకు చెప్పి సంతోషాన్ని పంచుకున్నాడు.
తల్లిదండ్రులకు కష్టాలు తీరాయని.. మిగతా బాధ్యతలు తాను చూసుకుంటానని చెప్పి హైదరాబాదుకు తిరిగి వచ్చాడు. గురువారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్ళాడు. సినిమా చూస్తూ చూస్తున్నవాడు హఠాత్తుగా పడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఏం జరిగిందో అర్థంకాక ఆ తర్వాత అతడిని.. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు.
కొడుకు చనిపోయిన విషయం తెలిసిన తల్లిదండ్రుల బాధకు అంతులేకుండా పోయింది. తమ కష్టాలు తీరిపోయాయని చెప్పి.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కొట్టే మురళీకృష్ణ అంత్యక్రియలు నక్కలగరుబు గ్రామంలో నిర్వహించారు.