
మెదక్: పుట్టింటి ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకొంది. Medak జిల్లా చేగుంట మండలం Vadiaram గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. Kamareddy జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన ధర్మగౌని Raju Goud కు నలుగురు కూతుళ్లు. వీరికి వివాహలు జరిగాయి.
వీరిలో Varalaxmi అనే కూతురు వడియారం గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటుంది. తండ్రి సంపాదించిన ఐదెకరాల భూమి పంపకం విషయంలో అక్కా చెల్లెళ్ల మధ్య వివాదం కొనసాగుతుంది. వరలక్ష్మి సోదరి రాజేశ్వరి వడియారం గ్రామానికి సోమవారం నాడు వచ్చింది. ఆస్తి పంపకం విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో Rajeshwari తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్ ను వరలక్ష్మిపై పోసి నిప్పంటించింది. ఈ విషయాన్ని గమనించిన వరలక్ష్మి పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పారు. అంబులెన్స్ ను రప్పించి వరలక్ష్మిని హైద్రాబాద్ కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.